BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, March 29, 2011

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో కోసి హత్య

Vishakapatnamవిశాఖపట్నం: ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన సంఘటన విశాఖపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇంటర్మీడియేట్ చదువుతున్న అశ్విని మృదుల అనే అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తితో కోసి చంపారు. విశాఖలోని దొండపర్తి జంక్షన్‌లోని మెట్రో రెసిడెన్సీలోని ఈ హత్య చోటు చేసుకుంది. ఈ హత్య మధ్యాహ్నం 11 నుండి 12 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అశ్విని కాళ్లు, చేతులు కట్టేసి గొంతును కత్తితో కోశారు. ఉదయం తమ్ముడితో పాటు ఇంట్లోనే అశ్విని ఉంది. అయితే తమ్ముడు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.

అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె హైదరాబాదు వెళ్లారు. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పెట్రోలు బంకులో పని చేసే వ్యక్తి దీనిని గమనించడంతో విషయం తెలిసింది. ఇంట్లోకి ఓ అంగతకుడు ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. అయితే పెట్రోలు బంకు నిర్వాహకులు కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా దొంగల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అశ్విని తండ్రిపై దొంగలు రెండుసార్లు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అశ్విని మృతదేహం బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది.

No comments:

Post a Comment