BREAKING NEWS
Tuesday, March 29, 2011
హీరోయిన్స్ తో తిరగొద్దంటూ కుర్ర హీరో కి వార్నింగ్
నేనేమీ ప్లే బోయ్ ని కాను.నేను ఇంతవరకూ ఎవరితోనూ ప్రేమాయణం సాగించలేదు. ఇన్నాళ్లుగా నా మీద వచ్చిన రూమర్స్ ని ఇక అపేస్తే మేలు. అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ నా తల్లితండ్రులు బాధపడుతున్నారు.నేనైతే వాటి గురించి పెద్దగా పట్టించుకోను. భవిష్యత్తులో ఏ హీరోయిన్ తోనూ సంబంధాలు పెట్టి రాయొద్దు అంటూ మీడియోతో మాట్లాడాడు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్‌బీర్. ప్రస్తుతం ఆయన నర్గిస్ ఫక్రితో కలిసి 'రాక్‌స్టార్' సినిమాలో నటిస్తున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ గురించి బాలీవుడ్ మీడియా ఓ ప్లే బోయ్ గా అభివర్ణిస్తుంది. దీపికా పదుకొణె, సోనమ్ కపూర్‌లతో ప్రేమాయణాలు సాగించాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరవాత కత్రినా కైఫ్, అనుష్క శర్మ, నర్గిస్ ఫక్రిలతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ ప్రేమ వార్తలు అతని ఇంట్లో కలకలం రేపాయి. కుటుంబ పెద్దలు ఈ కుర్ర హీరో ఇంట్లో హెచ్చరించినట్లు తెలిసింది.దాంతో ఇలా మీడియా ముందు అతను మాట్లాడాల్సి వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment