ఇలియానాకి ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదేమో కానీ ఆమె ఫ్రెజెన్స్ తో సినిమాలు ఆడే రోజులైతే ఎప్పుడో పోయాయి. ‘ఆట’లాంటి సినిమాకి కలెక్షన్లు రావడానికి కారణమైన ఇలియానా, ‘దేవదాసు’ విజయంలో కీలక భూమిక పోషించిన ఇలియానా ఇటీవలి కాలంలో అదే విధంగా సక్సెస్ కాలేకపోతోంది. సినిమా బాగోకపోతే ఇలియానా ఉన్నా కానీ జనం థియేటర్లకి రావడం లేదు. ఈ నేపథ్యంలో హిట్టిస్తేనే ఇలియానా తన ఉనికి నిలబెట్టుకోగలుగుతుంది. ‘రెచ్చిపో’, ‘సలీమ్’ వంటి డిజాస్టర్స్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ‘శక్తి’తో వస్తున్న ఇలియానాకి ఈ సమ్మర్ లో రెండు పరీక్షలు ఎదురు కానున్నాయి.
అవేంటంటే జూ ఎన్టీఆర్ తో ‘శక్తి’, దగ్గుబాటి రాణా తో ‘నేను నా రాక్షసి’ కేవలం కొద్ది వారాల వ్యవధిలో విడుదల కానుండగా ఈ రెండిట్లో ఒక్కటైనా మంచి హిట్ అయితేనే ఇలియానా తన డిమాండ్ నిలుపుకోగలుగుతుంది. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా తదితరుల కారణంగా ఇలియానా హిట్ ఎదుర్కొంటోంది. ఇక దానికి పరాజయాలు కూడా తోడయితే ఆమె పని మరింత జటిలమవుతుంది. అయితే తెలుగులో ఫ్లాప్స్ వచ్చినా కానీ తమిళం, హిందీలో ఫ్రెష్ గా జర్నీ స్టార్ట్ చేస్తున్నానని ఆమె ఓ పక్క ధీమాగానే ఉండి ఉండొచ్చు..
No comments:
Post a Comment