BREAKING NEWS
Tuesday, March 29, 2011
వివాహానంతరం...వేశ్యగా మనీషా కొయరాల
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ మనీషా కొయరాలా ఆ మధ్యన పెళ్ళి చేసుకుని సినీ జీవితానికి స్వస్తి చెప్పింది.అయితే తాజాగా ఆమె మనస్సు సినిమాలపై మళ్ళింది.నటిగా కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించటానికి సిద్దపడింది. దీప్తి నావల్ దర్శకత్వంలో రూపొందనున్న 'దో పైసే కి ధూప్ ఛార్ ఆనే కి బారిస్' అనే చిత్రం కమిటైంది.ఆ చిత్రంలో మనీషా వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇదని,వేశ్యగా బతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో తెలియజేస్తూనే ఆ వృత్తిలో ఉన్న భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నానని దర్శకుడు దీప్తి చెప్తున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమైన తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి ఎలాంటి కష్టాలకు ఓర్చుకోవల్సి వచ్చింది? ఇంతకీ కథకు ముగింపు ఎలా ఉంటుంది? అనేది కీలకమని చెప్తున్నాడు. కథ వినగానే నటించేందుకు మనీషా ఒప్పుకోవడం తనకు ఆనందం కలిగించిందని దీప్తి చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment