BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, March 29, 2011

మరో వేశ్యగా మారిన యాక్టర్ సంగీతా...

Sangeethaసాదారణంగా హీరోయిన్లు పోషించాలనుకునే పాత్రలు కొన్ని వుంటాయి. వాటిలో ఒకటి వేశ్య పాత్ర! ఆ క్యారెక్టర్ లో నటిస్తే తమలోని అసలైన నటి బయటకు వస్తుందని వాళ్ల నమ్మకం. ఆమధ్య అనుష్క కూడా అలాగే 'వేదం' సినిమాలో ఆ టైపు క్యారెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు మరో నటి సంగీత కూడా ఓ సినిమాలో వేశ్యగా యాక్ట్ చేసింది.

పెళ్లి చేసుకొని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్న సంగీత వేశ్యగా మారడం ఏమిటి?అనే సందేహంలో పడ్డారా..అయితే పప్పులో కాలువేసినట్టే..మరి ఎందుకంటే తమిళంలో ‘ధనం’ అనే చిత్రం కోసమే..పక్కా మాస్ తరహాలో సాగే ఈ పాత్ర సంగీతకు మంచి పేరే తెచ్చిందట.ఇప్పుడీ సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు అడ్డాల వెంకట్రావు. శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది యాక్ట్ చేయడం ఓ విశేషమైతే, సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగడం మరో విశేషం! కాగా సంగీత ‘శివపుత్రుడు’లో డీగ్లామర్ రోల్ తో పాటు ‘ఖడ్గం’లో సినిమా ఛాన్స్ కోసం అడ్డదారిలో పయనించిన యువతిగా నటించిన సంగీత..ఈ వేశ్య పాత్రలో ఎంతవరకు అలరించనుందో..తెలియాలంటే ధనం చిత్రం విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే...

No comments:

Post a Comment