BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, February 28, 2011

లెజెండ్రీ డైరెక్టర్ తో చేయడమే నా డ్రీమ్: మహేష్ బాబు

Mahesh Babuమహేష్ బాబు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వున్నాడు. దానికి కారణం నిన్న (ఫిబ్రవరి 27) చెన్నైలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను కలిసి, ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మణి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. మహేష్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసాడు.

'ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను' అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. అంతే కాకుండా మహేష్ బాబు లేటెస్ట్ బ్రాండ్ వివెల్ యాడ్ కోసం చెన్నై వెళ్ళిన ఆయన డబ్బిగ్ కార్యక్రమం కూడా పూర్తి చేసేసుకొని ఓ కమర్షియల్ యాడ్ నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందకు సహకరించినందుకు మొత్తం ఐటిసి టీమ్ కు బిగ్ థ్యాంక్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

కాగా మహేష్ బాబు ప్రస్తుతం ‘దూకుడు’చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే రీసెంటుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ది బిజినెస్ మేన్’ ప్రొజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ వెబ్‌సైట్‌పై సినీ హీరో బాలకృష్ణ ఏమని ఫిర్యాదు చేశారు?

Balakrishnaహైదరాబాద్: ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బాలయ్య ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని సిడ్నీ నుంచి నడుపుతున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయలేదు. నిర్వాహకులకు పోలీసులు నోటీసులు పంపించారు. సిడ్నీలోని తెలుగువారే ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫిర్యాదు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తానో సినిమా ఆర్టిస్టునని, సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నానని, సమాజంలో తనకో హోదా ఉందని ఆయన చెప్పుకున్నారు. తాను సినీ పరిశ్రమలో 30 ఏళ్లుగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఓ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడినని ఆయన అన్నారు. ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు. తన పార్టీ క్యాడర్, అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను కోరారు.

వెబ్సైటు గురించి కుళ్ళి కుళ్ళి..............


Balayya Fans and Chiranjeevi Fans Unhappy with Websites !

శక్తి ఆడియో వేడుకకి ఫుల్లుగా తాగేసి వచ్చాడు


Jackie Shroff Drunk at Shakti Audio launch !

రజనీకాంత్ కి ఈ లేడీస్ వీక్ నెస్ ఏంటో ?


Rajinikanth Interested in lady Villains !

మాట తప్పినా జూనియర్ ఎన్టీఆర్


NTR didnt keep his Promise !

Sunday, February 27, 2011

కుదిరితే కప్పు కాఫీ రివ్యూ


Movie Review : Kudirithe Kappu Coffee

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో నటించనున్న మోహన్ బాబు!?

Mohan Babuరక్త చరిత్రలో ఎన్టీఆర్ పాత్రకు అప్పట్లో మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ అడిగన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు అప్పుడు ఆ పాత్రను రిజెక్టు చేస్తే శతృఘ్నసిన్హా చేసారు.ఇప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించనున్న బెజవాడ రౌడీలు చిత్రంలో మోహన్ బాబుకి కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. మోహన్ బాబు కూడా వర్మ దర్సకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న..వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న దొంగలముఠాలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.

సునీల్ హీరోగా దిల్ రాజు భారీ చిత్రం..డిటేల్స్

Sunilదిల్ రాజు,సునీల్ కాంబినేషన్ లో సినిమా మార్చి 25 వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఇదేమీ సునీల్ కి కొత్త ప్రాజెక్టు కాదు. గణేష్ ఇందుకూరితో చేద్దామనుకున్న నెపోలియన్ సినిమానే ఇటు షిప్ట్ అయింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవటంతో టాలీ టు హాలీ బ్యానర్ పై చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ మొదటి సారిగా ఎయిట్ ప్యాక్ లుక్ తో కనపడనున్నాడు. రాజమౌళి దగ్గర అశోసియోట్ గా పనిచేసిన కోటి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కానున్నాడు. సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేసారు.

ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు చిత్రం క్రిందటివారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరోగా నెపోలియన్ చిత్రం సునీల్ కి నాలుగవది. ఈ చిత్రంపై సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

తెలుగు హీరోల్లో టాప్ రెమ్యునేషన్ ఆ హీరోకా..నిజమా?

Jr Ntrబెంగుళూరు మిర్రర్ పత్రిక రీసెంట్ గా టాలీవుడ్ హీరోల రెమ్యునేషన్స్ అంటూ ఓ లిస్ట్ ని ప్రచురించింది. ఆ లిస్ట్ లో రెమ్యునేషన్ లో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా అంతంత రెమ్యునేషన్స్ ఆ హీరోలు అందుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు బూకీల అరెస్టు!

Hyderabadహైదరాబాద్, విజయవాడ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువురిని పోలీసులు విజయవాడలో ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లండ్ - భారత్ మ్యాచ్ ఉండటంతో భారీగా బెట్టుంగులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య నగరాలలో పోలీసులు బెట్టింగులకు పాల్పడుతున్న వారిని పట్టుకొని అరెస్టు చేస్తున్నారు.ఈ క్రమంలో క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తుల్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.10 లక్షల నగదు, 12 సెల్‌ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో బెట్టింగులకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులు డేగ కళ్లతో వెతుకుతున్నారు. మప్టీలో పోలీసులు వారికోసం వెతుకులాట ప్రారంభించారు. గండిపేట, షామీర్‌పేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు మప్టీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారికోసం వెతుకుతున్నారు.

ఎమ్మెల్యే తనయుడి పెళ్లిలో చిరంజీవికి చేదు అనుభవం

Chiranjeeviహైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో తీవ్ర పరాభవం ఎదురయింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రెడ్యానాయక్ రెండో కుమారుడి వివాహానికి ఆదివారం చిరంజీవి వచ్చారు. పెళ్లి కొడుకు ఎమ్మెల్యే కవిత సోదరుడు కూడా. ఈ పెళ్లి ఎల్బీ నగర్‌లోని చంపాపేటలోని పుల్లారెడ్డి గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించారు. అయితే పెళ్లికి వచ్చిన చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు.

చిరును తెలంగాణవాదులు అడ్డుకొని తెలంగాణ వ్యతిరేకి అయిన చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనాలన్నారు. అయితే చిరంజీవి వారి మాటలను ఏమీ పట్టించుకోకుండా లోనికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయితే జై తెలంగాణ అంటేనే లోనికి పంపిస్తామని తెలంగాణవాదులు చెప్పారు. దీంతో ఆయన చిరు నవ్వుతో అక్కడినుండి సెక్యురిటీ మధ్య బయటకు వచ్చేశారు. వివాహ వేడుకలో రసాభాస జరగడం తనకు ఇష్టం లేనందునే అందుకే తిరిగి వచ్చానని ఆయన చెప్పారు.

బూతు పాటకు రెచ్చిపోయి చిందేసిందట..!


Hot Actress Hottest Item Song in Dum Maro Dum

ఆ పాడు పని నేను చేయలేను


Sonakshi no to Topless

ఎన్టీఆర్ శక్తి పై దౌటా..!


NTR doubts on Shakthi movie

Friday, February 25, 2011

ప్రిన్స్ మహేష్ ముఖ్య అతిధిగా అమరరాజా సిల్వర్ జూబ్లి వేడుకలు

Mahesh Babu

మహేష్ బాబు సాధారణంగా బయట జరిగే ఫంక్షన్స్‌కు హాజరవ్వని విషయం తెలిసిందే. కానీ ఇటీవల గల్లా అమరరాజా సిల్వర్ జూబ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకులకు మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫంక్షన్‌కు రావడానికి కారణం తన బావ గల్లా జయదేవ్‌తో ఉన్న సాన్నిహిత్యమే ఈఫంక్షన్‌కు ప్రిన్స్ మహేష్ బాబుని వచ్చేలా చేసిందని సమాచారం. ఈఫంక్షన్‌కి మహేష్ బాబుతో పాటు హీరో సుమంత్ కూడా హాజరవ్వడం జరిగింది.

ఇక ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి అయిన ఈసినిమా ఆడియో కార్యక్రమం ఏప్రిల్ జరగనుందని సమాచారం. ఈసినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తున్నారు. దూకుడు సినిమాలో మహేష్ ఓ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈసినిమా జూన్ లేక జులైలో అభిమానుల ముందుకు రానుందని సమాచారం.

బ్రహ్మానందం శాడిజానికి బలి అయినటువంటి మరో కొత్త ఆంటీ..!!

Hema-Bramhanandamడాక్టర్ బ్రహ్మానందం తన నటనతో యావత్ తెలుగు బ్రహ్మానందం శాడిజానికి బలయిన వాళ్శల్లో నటి హేమ కూడా ఉందని ఫిలింనగర్ సమాచారం. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందం భార్యగా చేసినటువంటి నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మద్య కాలంలో హేమ తన సన్నిహితులతో బ్రహ్మానందానికి చుక్కులు చూపిస్తానని, నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసినటువంటి బ్రహ్మానందానికి కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తానని అంటుందని సమాచారం.

హేమ బ్రహ్మానందంపై ఈరేంజిలో రివేంజి తీర్చుకుంటానని చెప్పడం వెనుక బ్రహ్మానందం తనని ఏరేంజిలో ఇబ్బంది పెట్టాడో ఊహించుకోవచ్చు. దీనిని బట్టి బ్రహ్మానందంపై ఎత్తుకు పైఎత్తులు వేసి బాగా ఏడిపించాలనే పనిలో పడిందని వినికిడి. ఇది ఇలా ఉండే గతంలో బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించినటువంటి శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన శివారెడ్డిని బ్రహ్మానందం అవమానించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇది మాత్రమే కాకుండా జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం. ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట.
ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్న హాస్య నటుడు. అది వెండి తెరమీద. కానీ వెండి తెరమీద కంటే బయట బ్రహ్మానందం చాలా పెద్ద శాడిస్ట్ అని తన సహానటులను ముప్పు తిప్పులు పెడుతుండాడని అంటుంటారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో బ్రహ్మానందం మీద చాలా వచ్చాయి. బ్రహ్మానందం ఖాతాలో ఇప్పుడు మరో నటి చేరింది. ఎవరా ఆనటి అనుకుంటున్నారా..

తెలుగు సినిమాలలో బికినీయా ఏమైనా ఉందా, కానీ హిందీలో బికినీకి ఓకే

Kajal
తెలుగు సినిమా తెరమీద మగధీరతో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకున్న కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే టూ పీస్ బికినీతో బాలీవుడ్ జనానికి వలవేయాలని అనుకుంటుందంట. దీనికి కారణం తమిళంలో సింగం సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

తమిళ సింగం సినిమాలో అందాల తార అనుష్క తన అందాలను చాలా తెలివిగా ప్రదర్శించడం జరిగింది. తన అందంలో యావత్ తమిళ తంబిల మతి పోగోట్టిన విషయం తెలిసిందే. దాంతో ఈసినిమాని హిందీలో రూపోందిస్తున్న తరుణంలో, హిందీ వెర్షన్‌లో కాజల్ అందాలను ప్రత్యేకంగా చూపించాలని చిత్ర దర్శకుడు కాజల్ సోగసులపై స్పెషల్ ఫోకస్ పెట్టాడని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా కాజల్‌ని టూ పీస్ బికినీలో చూపించాలనే ప్రయత్నాలు బాలీవుడ్‌లో జరుగుతుంటే కాజల్ కూడా ఈసినిమాలో బికినీ వేయడానికి ఒప్పుకుందని సమాచారం. గతంలో బికినీ లాంటి దుస్తులు నాకు సూట్ అవ్వవు అని చెప్పిన కాజల్ ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా అనగానే ఒక్కసారి బికినీకి రెడీ అయిపోయిందని ఫిలిం నగర్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి కాజల్ మాత్రం తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫర్‌పెక్ట్ అనే చిత్రంలో నటించింది. ఈసినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక నాగచైతన్యతో నా డ్రీమ్ లవర్ అనే సినిమాలో బుక్ అయ్యింది. అలాగే రవితేజ సరసన వీర అనే సినిమాలో నటిస్తున్నారు.

యాభై రోజులు పూర్తి చేసుకున్న మాస్ రాజా రవితేజ మిరపకాయ్

Mirapakaya
రవితేజ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం రవితేజది. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మాస్ రాజా రవితేజ 'మిరపకాయ్' చిత్రం 114 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుంటోందని ఎల్లోఫ్లవర్స్ అధినేత, నిర్మాత రమేష్ పుప్పాల చెప్పారు. మా ఎల్లో ఫ్లవర్స్ సంస్ధ నిర్మించిన తోలి చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి కారకులైన హీరో రవితేజ గారికి, దర్శకులు హరీష్ శంకర్ గారికి ఈ చిత్రానికి పని చేసిన నటినటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే అర్ద శతదినోత్సవ వేడుకల్ని ఘనంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత రమేష్ పుప్పాల చెప్పారు.

'మిరపకాయ్' మంచి హిట్ అయ్యినందుకు హ్యాపీగా వుంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు హరీష్ శంకర్ దే. ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు' అన్నారు మాస్ రాజా రవితేజ. ఈసినిమాలో నటించినటువంటి హీరోయిన్లు రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేధ్‌లు కూడా ఈవిజయంలో వారి వంతు సహాకారాన్ని అందించారని అన్నారు.

ఏ హీరో చూసినా ఒకటే కథ....ప్రకాష్ రాజ్ ఆవేదన

Prakash Rajమన పరిశ్రమలో సినిమా టైటిల్ మారుతుంది. హీరో మారతాడు. కథే మారదు. ఒక కథకు ఎంతో మంది హీరోలుంటారు.ప్రతీ హీరో అదే కథని చేసి ఉంటాడు అంటూ అవేదన వెళ్ళబుచ్చారు ప్రకాష్ రాజు. కొత్త కథలు రావటంలేదని, హీరోలందరూ మార్చి మార్చి ఒకే రకమైన ఫార్ములా కథలు చేస్తున్నారని ఆయన ధైర్యంగా చెప్తున్నారు. అలాగే కథల విషయంలో మన దర్శకులు కొత్తదారిలో ఎందుకు వెళ్లక పోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు.ముఖ్యంగా ఈ పరిశ్రమలో అన్నీ కమర్షియల్ సూత్రాల ప్రకారం జరిగిపోతూంటాయి. ఏదైనా కొత్తగా చేయటానకి, సాహసాలు చేయడానికి ఒప్పుకోరు అన్నారు. అలాగే నాక్కూడా పాత్రలు రొటీన్‌గానే అనిపిస్తున్నాయి. పది సినిమాలు చేశానంటే వాటిలో అయిదు నేను అంతకు ముందు చేసిన పాత్రలే. ఈ విషయం నాకు ఆ కథ వింటున్నప్పుడే అర్థమవుతుంది. కానీ తప్పడం లేదు. అందుకే అప్పుడప్పుడూ నేను నిర్మాతగా అయినా కొత్తగా ట్రై చేస్తూంటాను అన్నారు. ఇటీవల ఆయన తమిళంలో నిర్మించిన పయినం(తెలుగు గగనం) చిత్రం విజయం సాధించింది. రాధా మోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఆ చిత్రం విడుదల అయ్యింది. అలాగే ఆయనకు ప్రస్తుత విద్యా వ్యవస్ధపై ఓ చిత్రం డైరక్ట్ చేయాలని ఉందన్నారు.

వేశ్యగా నటించడం కోసం రెడ్ లైట్ ఏరియాకి వెళతానన్న అందగత్తె

Priyanka Chopraబాలీవుడ్‌లో సృజనాత్మకతకు మారుపేరు కరణ్ జోహార్. కరణ్ జోహార్ ఏ సినిమా తీసిన అందులో ఓ కొత్త ఫందాని అవలంభిస్తుంటాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా అగ్నిఫధ్ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా మొట్టమొదటిసారి ఓ వేశ్య పాత్రను పోషిస్తున్నారు.

దీంతో ప్రియాంక చోప్రా తన వేశ్య పాత్రని రక్తి కట్టించడం కోసం కాస్త ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ అవసరమని భావించింది. దీనికోసం గాను ప్రియాంకచోప్రా రెట్ లైట్ ఏరియాకి వెళతానని పట్టుబడిందంట. ఈవిషయం తెలిసిన కరణ్ జోహార్ కంగారుపడి అదంతా అవసరం లేదని వారించడం జరిగింది. నాసినిమాలో నటించే కధానాయిక ఎలా ఉండాలో తాను స్టడీ చేశానని, అలా చేస్తే సరిపోతుందని చెప్పాడంట.

అయినా సరే ప్రియాంక చోప్రా మాత్రం తాను రెడ్ లైట్ ఏరియాకి వెళ్శాలని మంకుపట్టు పట్టిదంట. చివరకి అక్కడికి వెళ్శడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి కరణ్ జోహార్ తలప్రాణం తోకకి వచ్చిందని సమాచారం. మొత్తానికి ఎట్టకేలకు ప్రియాంక చోప్రాని రెడ్ లైట్ ఏరియాకి వెళ్శకుండా ఆపినందుకు తాను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని వినికిడి.

బెంగళూరులో ఉరేసుకున్న ఆంధ్రప్రదేశ్ టెక్కీ భార్య అనూష

Karnataka Mapబెంగళూరు: రెండేళ్ల క్రితం ఓ టెక్కీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల ఫిజియోథెరిపిస్టు బెంగళూరులోని శక్తినగర్ కెఆర్ పురం పోలీసు స్టేషన్ పరిధిలో తన దుపట్టాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతురాలు అనూషకు పది నెలల పాప ఉంది. ఆమె భర్త టెక్కీ రామకృష్ణను, ఆమె మామ రామమూర్తిని, అత్త జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన అనూష ఎంతకీ బయటకు రాకపోవడంతో జయలక్ష్మి పిలిచింది. అయినా స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. అనూష శవం బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని కనిపించింది. వరకట్నం కోసం తన కూతురును రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తూ వచ్చారని అనూష తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు అనూషకు తనిష్క పుట్టిన తర్వాత వారి ఒత్తిడి మరీ ఎక్కువైందని ఆమె చెప్పింది.