BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 27, 2011

సునీల్ హీరోగా దిల్ రాజు భారీ చిత్రం..డిటేల్స్

Sunilదిల్ రాజు,సునీల్ కాంబినేషన్ లో సినిమా మార్చి 25 వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఇదేమీ సునీల్ కి కొత్త ప్రాజెక్టు కాదు. గణేష్ ఇందుకూరితో చేద్దామనుకున్న నెపోలియన్ సినిమానే ఇటు షిప్ట్ అయింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవటంతో టాలీ టు హాలీ బ్యానర్ పై చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ మొదటి సారిగా ఎయిట్ ప్యాక్ లుక్ తో కనపడనున్నాడు. రాజమౌళి దగ్గర అశోసియోట్ గా పనిచేసిన కోటి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కానున్నాడు. సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేసారు.

ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు చిత్రం క్రిందటివారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరోగా నెపోలియన్ చిత్రం సునీల్ కి నాలుగవది. ఈ చిత్రంపై సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

No comments:

Post a Comment