BREAKING NEWS
Friday, February 25, 2011
ఏ హీరో చూసినా ఒకటే కథ....ప్రకాష్ రాజ్ ఆవేదన
మన పరిశ్రమలో సినిమా టైటిల్ మారుతుంది. హీరో మారతాడు. కథే మారదు. ఒక కథకు ఎంతో మంది హీరోలుంటారు.ప్రతీ హీరో అదే కథని చేసి ఉంటాడు అంటూ అవేదన వెళ్ళబుచ్చారు ప్రకాష్ రాజు. కొత్త కథలు రావటంలేదని, హీరోలందరూ మార్చి మార్చి ఒకే రకమైన ఫార్ములా కథలు చేస్తున్నారని ఆయన ధైర్యంగా చెప్తున్నారు. అలాగే కథల విషయంలో మన దర్శకులు కొత్తదారిలో ఎందుకు వెళ్లక పోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు.ముఖ్యంగా ఈ పరిశ్రమలో అన్నీ కమర్షియల్ సూత్రాల ప్రకారం జరిగిపోతూంటాయి. ఏదైనా కొత్తగా చేయటానకి, సాహసాలు చేయడానికి ఒప్పుకోరు అన్నారు. అలాగే నాక్కూడా పాత్రలు రొటీన్‌గానే అనిపిస్తున్నాయి. పది సినిమాలు చేశానంటే వాటిలో అయిదు నేను అంతకు ముందు చేసిన పాత్రలే. ఈ విషయం నాకు ఆ కథ వింటున్నప్పుడే అర్థమవుతుంది. కానీ తప్పడం లేదు. అందుకే అప్పుడప్పుడూ నేను నిర్మాతగా అయినా కొత్తగా ట్రై చేస్తూంటాను అన్నారు. ఇటీవల ఆయన తమిళంలో నిర్మించిన పయినం(తెలుగు గగనం) చిత్రం విజయం సాధించింది. రాధా మోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఆ చిత్రం విడుదల అయ్యింది. అలాగే ఆయనకు ప్రస్తుత విద్యా వ్యవస్ధపై ఓ చిత్రం డైరక్ట్ చేయాలని ఉందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment