BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, February 28, 2011

ఆ వెబ్‌సైట్‌పై సినీ హీరో బాలకృష్ణ ఏమని ఫిర్యాదు చేశారు?

Balakrishnaహైదరాబాద్: ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బాలయ్య ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని సిడ్నీ నుంచి నడుపుతున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయలేదు. నిర్వాహకులకు పోలీసులు నోటీసులు పంపించారు. సిడ్నీలోని తెలుగువారే ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫిర్యాదు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తానో సినిమా ఆర్టిస్టునని, సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నానని, సమాజంలో తనకో హోదా ఉందని ఆయన చెప్పుకున్నారు. తాను సినీ పరిశ్రమలో 30 ఏళ్లుగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఓ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడినని ఆయన అన్నారు. ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు. తన పార్టీ క్యాడర్, అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను కోరారు.

No comments:

Post a Comment