హైదరాబాద్, విజయవాడ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువురిని పోలీసులు విజయవాడలో ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లండ్ - భారత్ మ్యాచ్ ఉండటంతో భారీగా బెట్టుంగులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య నగరాలలో పోలీసులు బెట్టింగులకు పాల్పడుతున్న వారిని పట్టుకొని అరెస్టు చేస్తున్నారు.ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తుల్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.10 లక్షల నగదు, 12 సెల్‌ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో బెట్టింగులకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులు డేగ కళ్లతో వెతుకుతున్నారు. మప్టీలో పోలీసులు వారికోసం వెతుకులాట ప్రారంభించారు. గండిపేట, షామీర్‌పేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు మప్టీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారికోసం వెతుకుతున్నారు.
No comments:
Post a Comment