BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 27, 2011

ఎమ్మెల్యే తనయుడి పెళ్లిలో చిరంజీవికి చేదు అనుభవం

Chiranjeeviహైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో తీవ్ర పరాభవం ఎదురయింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రెడ్యానాయక్ రెండో కుమారుడి వివాహానికి ఆదివారం చిరంజీవి వచ్చారు. పెళ్లి కొడుకు ఎమ్మెల్యే కవిత సోదరుడు కూడా. ఈ పెళ్లి ఎల్బీ నగర్‌లోని చంపాపేటలోని పుల్లారెడ్డి గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించారు. అయితే పెళ్లికి వచ్చిన చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు.

చిరును తెలంగాణవాదులు అడ్డుకొని తెలంగాణ వ్యతిరేకి అయిన చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనాలన్నారు. అయితే చిరంజీవి వారి మాటలను ఏమీ పట్టించుకోకుండా లోనికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయితే జై తెలంగాణ అంటేనే లోనికి పంపిస్తామని తెలంగాణవాదులు చెప్పారు. దీంతో ఆయన చిరు నవ్వుతో అక్కడినుండి సెక్యురిటీ మధ్య బయటకు వచ్చేశారు. వివాహ వేడుకలో రసాభాస జరగడం తనకు ఇష్టం లేనందునే అందుకే తిరిగి వచ్చానని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment