మహేష్ బాబు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వున్నాడు. దానికి కారణం నిన్న (ఫిబ్రవరి 27) చెన్నైలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను కలిసి, ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మణి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. మహేష్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసాడు.
'ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను' అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. అంతే కాకుండా మహేష్ బాబు లేటెస్ట్ బ్రాండ్ వివెల్ యాడ్ కోసం చెన్నై వెళ్ళిన ఆయన డబ్బిగ్ కార్యక్రమం కూడా పూర్తి చేసేసుకొని ఓ కమర్షియల్ యాడ్ నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందకు సహకరించినందుకు మొత్తం ఐటిసి టీమ్ కు బిగ్ థ్యాంక్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం ‘దూకుడు’చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే రీసెంటుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ది బిజినెస్ మేన్’ ప్రొజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment