బెంగళూరు: రెండేళ్ల క్రితం ఓ టెక్కీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల ఫిజియోథెరిపిస్టు బెంగళూరులోని శక్తినగర్ కెఆర్ పురం పోలీసు స్టేషన్ పరిధిలో తన దుపట్టాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతురాలు అనూషకు పది నెలల పాప ఉంది. ఆమె భర్త టెక్కీ రామకృష్ణను, ఆమె మామ రామమూర్తిని, అత్త జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన అనూష ఎంతకీ బయటకు రాకపోవడంతో జయలక్ష్మి పిలిచింది. అయినా స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. అనూష శవం బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని కనిపించింది. వరకట్నం కోసం తన కూతురును రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తూ వచ్చారని అనూష తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు అనూషకు తనిష్క పుట్టిన తర్వాత వారి ఒత్తిడి మరీ ఎక్కువైందని ఆమె చెప్పింది.
No comments:
Post a Comment