BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 27, 2011

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో నటించనున్న మోహన్ బాబు!?

Mohan Babuరక్త చరిత్రలో ఎన్టీఆర్ పాత్రకు అప్పట్లో మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ అడిగన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు అప్పుడు ఆ పాత్రను రిజెక్టు చేస్తే శతృఘ్నసిన్హా చేసారు.ఇప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించనున్న బెజవాడ రౌడీలు చిత్రంలో మోహన్ బాబుకి కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. మోహన్ బాబు కూడా వర్మ దర్సకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న..వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న దొంగలముఠాలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.

No comments:

Post a Comment