BREAKING NEWS
Friday, February 25, 2011
యాభై రోజులు పూర్తి చేసుకున్న మాస్ రాజా రవితేజ మిరపకాయ్
రవితేజ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం రవితేజది. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మాస్ రాజా రవితేజ 'మిరపకాయ్' చిత్రం 114 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుంటోందని ఎల్లోఫ్లవర్స్ అధినేత, నిర్మాత రమేష్ పుప్పాల చెప్పారు. మా ఎల్లో ఫ్లవర్స్ సంస్ధ నిర్మించిన తోలి చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి కారకులైన హీరో రవితేజ గారికి, దర్శకులు హరీష్ శంకర్ గారికి ఈ చిత్రానికి పని చేసిన నటినటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే అర్ద శతదినోత్సవ వేడుకల్ని ఘనంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత రమేష్ పుప్పాల చెప్పారు.
'మిరపకాయ్' మంచి హిట్ అయ్యినందుకు హ్యాపీగా వుంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు హరీష్ శంకర్ దే. ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు' అన్నారు మాస్ రాజా రవితేజ. ఈసినిమాలో నటించినటువంటి హీరోయిన్లు రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేధ్‌లు కూడా ఈవిజయంలో వారి వంతు సహాకారాన్ని అందించారని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment