ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 28, 2011
అలా చేస్తే వ్యక్తిగతంగా నాకు హెల్ప్...తమన్నా
అలా చేస్తే వ్యక్తిగతంగా నాకు హెల్ప్...తమన్నా
భాష తెలిసుంటే వ్యక్తిగతంగా కూడా హెల్ప్ అవుతుందని పేర్కొన్నారు. అందుకే తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, భాష తెలిస్తే చిత్ర పరిశ్రమలో చాలా లాభాలున్నాయని హ్యాపీ గర్ల్ తమన్నా అంటోంది. రీసెంట్ గా మీడియాతో ఆమె మాట్లాడుతూ... తమిళంలో ఎక్కువ సినిమాలు చేయడంవల్ల తమిళం మాట్లాడడం నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను అంది. అలాగే...- నటనకు భాషా బేధం ఉండదు. అయితే వచ్చిన ఆఫర్స్ కి న్యాయం చేయాలంటే భాష తెలుసుంటే మేలు. భాష తెలిస్తే చాలా లాభాలున్నాయి. పాత్రను అర్ధం చేసుకుని అందులో లీనమై నటించవచ్చు. యూనిట్ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి భాష బాగా ఉపయోగపడుతుంది అంది. ఇక ప్రస్తుతం ఆమె అల్లుఅర్జున్ సరసన ‘బద్రీనాథ్’, నాగ చైతన్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.వీటి తర్వాత ఎన్టీఆర్ తో రచ్చ చిత్రంలో చేయబోతోంది. ఈ చిత్రాల తర్వాత తమిళంలో ధనుష్‌తో ‘వేంగై’ చిత్రం చేస్తోంది. ‘వేంగై’ చిత్రంకోసం కారైకుడి వెళ్లనున్నట్టు చెప్తోంది. అలాగే ఇకపై తెలుగు తమిళ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మొన్న సంక్రాంతికి హీరో కార్తీతో కలిసి నటించిన ‘చిరుతై’ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
No comments:
Post a Comment