ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 28, 2011
తండ్రి వైయస్సార్ బాటలో జగన్ 70 కిలోమీటర్ల పాదయాత్ర
తండ్రి వైయస్సార్ బాటలో జగన్ 70 కిలోమీటర్ల పాదయాత్ర
హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పోలవరం సాధన కోసం జగన్ ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తొలి రోజు ఫిబ్రవరి 7వ తేదీన జగన్ తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభించి ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజి చేరుకుంటారు. రెండవ రోజు ఫిబ్రవరి 8వ తేదీన జగన్ పాదయాత్ర కాటన్ బ్యారేజి వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరపురం చేరుకుంటుంది. రాత్రి వేగేశ్వరంలో ఆయన బస చేస్తారు. మూడోరోజు ఫిబ్రవరి 9 వేగేశ్వరపురంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది. 9వ తేదీ సాయంత్రం పోలవరంలో బహిరంగ సభ జరుగుతుంది.
No comments:
Post a Comment