BREAKING NEWS
Friday, January 28, 2011
జూ ఎన్టీఆర్ ని వివరణ కోరుతున్న ఫ్యాన్స్...
ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ గా చలామనిఅవుతున్న జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల నిశ్చితార్థం అయిన విషయం విదితమే. అయితే అల్లు అర్జున్ పెళ్లి మార్చి 6న ఖాయమైపోయింది. నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న బన్నీ నాలుగు నెలలు తిరగకుండానే పెళ్లిపీటలెక్కేస్తున్నాడు. కానీ అతనికంటే ఎనిమిది నెలలు ముందు ఎంగేజ్ మెంట్ అయిన జూ ఎన్టీఆర్ కి మాత్రం ఇప్పటిదాకా పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాలేదు. గత ఏడాది మేలోనే పెళ్లి చేసుకుంటున్నాడని ఎన్టీఆర్ గురించి వార్తలొచ్చాయి. అయితే నవంబర్ 18న పెళ్లి ఖాయమని ఎన్టీఆర్ క్యాంప్ నుంచే న్యూస్ వచ్చింది. పెళ్లి కోసమని షూటింగులు కూడా త్వరత్వరగా కానిచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా సినిమాలు అంగీకరిస్తూ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ మద్య జూ ఎన్టీఆర్ చూడటానిక చాలా డల్ గా కనిపిస్తూ మునుపటిలాగా లావెక్కి పోతున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment