ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, January 26, 2011
ఛార్మి నే కంటిన్యూ చేద్దామనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ
ఛార్మి నే కంటిన్యూ చేద్దామనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకన్ను ఛార్మిపై పడింది. దాంతో ఆమెకు బాగా కలిసి వచ్చేటట్లు కనపడుతోంది. ప్రస్తుతం ఆమె పెద్ద హీరోల సినిమాలపై ఆశ వదిలేసుకుంటున్న సమయంలో రవితేజ సరసన దొంగల ముఠాలో ఆఫర్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పూరీ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాను నిర్మించనున్న బుడ్డ చిత్రంలోనూ ఆమెను తీసుకున్నారు. మొదట ఈ పాత్రకు తాప్సీని అడిగారు. కానీ తాప్సీ తమిళంలో ధనుష్ తో చేసిన చిత్రం హిట్టవటంతో అక్కడ బిజీగా మారింది. దాంతో ఆమె డేట్స్ లేవంటూ రిజెక్టు చేసింది. వెంటనే ఛార్మి ఆ ప్లేసులోకి దూరిపోయింది. ఇక ఛార్మి ఈ రెండు ప్రాజెక్టులలోనే కాక మరిన్ని వర్మ చిత్రాల్లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఆ తర్వాత మహేష్,పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.
No comments:
Post a Comment