BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, January 28, 2011

రైడింగ్ కి వెళ్తే హీరోయిన్ ఇంట్లో హీరోగారు దర్శనం

రైడింగ్ కి వెళ్తే హీరోయిన్ ఇంట్లో హీరోగారు దర్శనం

 Priyanka Chopraప్రియాంక చోప్రా ఇంటికి రైడింగ్ కి వెళ్ళిన ఐటీ అధికారులకు అక్కడ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దర్శనమిచ్చాడంటూ బాలీవుడ్ లో గుప్పుమంది. ఆ ఐటీ అధికారి అతన్ని బట్టలు వేసుకుని వెళ్ళిపొమ్మన్నాడని, ఆ తర్వాత తీరిగ్గా ఆ వార్తను మీడియాకు లీక్ చేసి ఆనందపడ్డాడంటూ అంతటా వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా మాజీ ప్రేమికుడు అయిన షాహిద్ కపూర్ ఆ ఇంట్లో దర్శనం ఇవ్వటం అనేది కొందరు నమ్మలేమంటున్నారు. అయితే బయిటకు ఇద్దరూ బద్ద శత్రువుల్లా వ్యవహిస్తున్నా ఎఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారని ఈ సంఘటన రుజువు చేసిందంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ..ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో ఆమె పెళ్ళి చేసుకున్న ఏడుగురు భర్తలను వరసగా చంపేసే పాత్రను పోషిస్తోంది. ఆంగ్ల చిత్రం 'సెవెన్‌ హజ్బండ్స్‌'ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.

No comments:

Post a Comment