మహిళపై సామూహిక అత్యాచారం: రాజధానిలో ఇద్దరు మహిళల హత్య
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో రెండు వేరునవేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు. ఈ ఇద్దరు హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాదులోని తాళ్లగడ్డ స్మశాన వాటిక వెనుకవైపు కబడ్డీ కోర్టు దగ్గరలో ఓ మహిళను హత్య చేసి తగులబెట్టారు. ఆ శవం మార్కండేయనగర్‌కు చెందిన రజ్వీదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు చంపారు, ఎవరు చంపారనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని నాగోలు మూసీ వంతెన పక్కన కూడా మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది. కొందరు దుండగులు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి అనంతరం చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment