BREAKING NEWS
Friday, January 28, 2011
శ్రీవారి ప్రసాదాల రేట్లు భారీగా పెంపు: జిలేబి 75 రూపాయలు
తిరుపతి: కోట్లాది భక్తుల దైవం, నిత్యం లక్షలాది భక్తులు దర్శించుకునే తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం ధరలను శుక్రవారం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భారీగా పెంచారు. ప్రసాదాల రేట్లు ఒక్కోటి సుమారు మూడు రెట్లనుండి ఏడు రెట్ల వరకు పెంచడం గమనార్హం. అయితే కోట్లాది భక్తులు అత్యంత ఇష్టపడే శ్రీవారి లడ్డూ ధరను మాత్రమ ధరన పెరుగుదలనుండి మినహాయించడం భక్తులకు సంతోషకరమైన విషయం. శ్రీవారి ప్రసాదం జిలేబి ధర 25 రూపాయలనుండి 70 రూపాయలకు, వడ రేటును రూ.4నుండి రూ.25కు., మురుకును రూ.4నుండి రూ.30కి పెంచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment