ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 28, 2011
విలన్ గా మారిపోతున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్
విలన్ గా మారిపోతున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ అదరకొట్టిన ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ త్వరలో విలన్ గా దర్శనమివ్వబోతోంది. ఓ కన్నడ చిత్రంలో ఆమె ప్రతినాయకి పాత్రను పోషించేందుకు సైన్ చేసింది.ఈ విషయమై మాట్లాడుతూ..నా కళ్లు, శరీర కదలికలు నెగిటివ్ రోల్స్ కు సరిపోతాయి. అందుకే తమ చిత్రాల్లో లేడీ విలన్ గా నటించమంటూ గతంలో చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఎప్పుడూ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే నటనకు ఏ పాత్ర అయినా ఒకటే...అనిపించి ఓ కన్నడ చిత్రం కమిటయ్యాను. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించగలనను నమ్మకముంది. అతి త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలిపింది. ముమైత్ ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘నేను.. నా రాక్షసి’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.
No comments:
Post a Comment