BREAKING NEWS
Friday, January 28, 2011
బాలకృష్ణ, బాపుల 'శ్రీరామ రాజ్యం' చిత్రం విడుదల తేదీ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశ కంటే గొప్పగా శ్రీరామ రాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి..అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment