ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 28, 2011
నేను ఆయన్ని కలసాననేది రూమరే...శ్రియ
నేను ఆయన్ని కలసాననేది రూమరే...శ్రియ
నేను సల్మాన్ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ ఏవో రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అసలు నేను ఆయన్ని ఒక్కసారైనా కలుసుకోలేదు. అందుకు సంబంధించిన విషయాలు మీడియాలో చూడగానే నాకు నవ్వాగలేదు. వీలైతే తప్పకుండా రష్దీని కలుస్తాను అంటోంది శ్రియ. మొవ్న పవన్ పులి లోనూ, ఆ తర్వాత డాన్ శీను లో కనిపించిన శ్రియ తాజాగా దీపా మెహతా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఆ సినిమాకి సల్మాన్ రష్దీ రచించిన 'మిడ్‌నైట్ చిల్డ్రన్స్' నవల ఆధారం. దాంతో ఆమె, సల్మాన్ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై శ్రియ ఇలా స్పందించింది.
అలాగే శ్రియ త్వరలో 'పానీ' అనే చిత్రంలో నటించబోతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరక్ట్ చేసే ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. నీటి కోసం ధనిక, పేద వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అలాగని ఈ చిత్రం మరీ ఆర్ట్ ఫిలింలా ఉండదు..మరో ప్రక్క ప్రేమ కథ కూడా నడుస్తూంటుంది. హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి 'స్లమ్‌డాగ్ మిలియనీర్' దర్శకుడు డానీ బోయెల్ నిర్మాత. ఈ చిత్రంలో రాకేష్ రోషన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా ఓ సందేశం కూడా ఉంటుందని చెప్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రహమాన్ సంగీతం అందించనున్నారు.
No comments:
Post a Comment