హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల వ్యహారం చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని భావించిన చిరంజీవికి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల కోటాలో ఓ ఎమ్మెల్సీ సీటు కేటాయించింది. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ తిరుగుబాటు చేశారు. ఈ మేరకు ఆమె చిరంజీవికి ఓ లేఖ రాశారు. ఎమ్మెల్సీ సీటును సి. రామచంద్రయ్యకు కేటాయించాలని చిరంజీవి నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు చిరంజీవి సోమవారం ఉదయం పార్టీ శాసనసభ్యులతో, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. వాసిరెడ్డి పద్మ వైయస్ జగన్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.
No comments:
Post a Comment