దబాంగ్ బాలీవుడ్‌లో ఓ చరిత్రను నెలకోల్పినటువంటి సినిమా. ఒకే ఒక్క సినిమాతో యావత్ బాలీవుడ్ మొత్తం అభిమానులను సంపాదించుకుంది సోనాక్షిసిన్హా. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ కూడా ఈమె డైరీలోని కొన్ని పేజీలను కేటాయించాలని తిరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచ కధానాయకుడు కమల్ హాసన్ ప్రక్కన ఈ భామ నటించనుందని వార్తలు రావడం జరిగింది.
ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ పాత హీరో సోనాక్షిసిన్హాని తన సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో అర్రులు చాచుతున్నట్లు వినికిడి. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన విక్టరీ వెంకటేష్ అండి. గతంలో త్రిష, నయనతార, అసిన్ లాంటి హీరోయిన్స్ తో నటించి, నటించి చివరకి బోర్ కోట్టి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కళ్శు బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా మీద పడ్డాయని ఫిలింవర్గాల సమాచారం.
త్వరలో చిత్రం సినిమా దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించనున్నటువంటి సావిత్రి సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షిసిన్హా ఐతే బాగుంటుందని వెంకటేష్ చెప్పినట్లు వినికిడి. దాంతో సోనాక్షిసిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఐతే ఇప్పటికే సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి చాలా సినిమాలు సోనాక్షిసిన్హా అంగీకరించకపోవడం మరో విశేషం. దానికి కారణం డేట్స్ కుదరకపోవడమేనంట.
ఐతే టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ సరసన నటించడానికి ఒప్పుకుంటుందే లేదో చూద్దాం. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ మన రీమేక్ రాజా అయినటువంటి బెల్లంకోండ సురేష్ బాడీగార్డ్ సినిమాని రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో వెంకీ సరసన అందాలతార ఇలియానా ఆడిపాడనున్నారు. ఈ సినిమాకి డాన్ శీను సినిమాకి దర్శకత్వం వహించినటువంటి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు.
No comments:
Post a Comment