బాలకృష్ణ చిరంజీవిలను ద్వేషిస్తూ కొంతమంది వెబ్ సైట్లు నడుపుతూ వారిరువురుపై దుష్ప్రచారానికి ఇష్టంగా కష్టపడిన సంగతి, తర్వాత బాలకృష్ణ పోలీసు కంప్లైటు ఇవ్వడం తథితర సంగతులన్నీమన అందరికి తెలిసిందే. అయితే, ఈ తతంగానంత వివరిస్తున్న ప్రతీ పత్రిక మరియు న్యూస్ చానెల్ వాళ్ళు మరో మారు సదరు వెబ్ సైట్ వాళ్ళు బాలకృష్ణ చిరంజీవిలపై వ్రాసుకొని ప్రచారంలోకి తెచ్చిన అనేకానేక జోకులని, ఫోటోలని వేసి మరీ చూపిస్తూ మంచి మసాల కధనాలని వండి వడ్డిన్చేస్తున్నారు వారి పాటకులు మరియు ప్రేక్షకులకి.
చివరికి ఇదంతా ఎలా తయారైందంటే, యిల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు దొరికిందని మరోడు సంతోసిన్చినట్లు! ఇక, బాలకృష్ణ చిరంజీవిల విషయానికి వస్తే, మొగుడు కొట్టినందు కాదు నే ఏడ్చింది, తోడి కోడలు నవ్వినందుకే అన్నట్లు! వాడెవడో మాకు సైటు పెట్టడమేమిటి, పెట్టినా ఈ తిట్టడమేమిటి అని వాపోతున్న మన హీరోలద్దరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తునారు రోజుకో జోకు రెండ్రోజులకో చర్చవేదికలతో ఈ న్యూస్ పేపరు వాళ్ళు, న్యూస్ చానెల్ వాళ్ళు.
అయినా, వాళ్ళు అసలు తమ మీద జాలి పడుతున్నారా లేక యెగతాళి చేస్తున్నారా అనే అనుమానము లేక పోలేదు మన హీరోలకి. పచ్చి పుండు మీద కారం జల్లి ఉఫ్ ఉఫ్ మని ఉంది ఉసులాడుకొంటున్న విలంధరిని ఏమి చేయాలో తెలియక, ఏమి చేయలేక విగ్గులు పిక్కొంటున్నారు మన హీరోలిద్దరు.
No comments:
Post a Comment