నిన్న హైటెక్స్‌లో అశేష ప్రజానీకం ముందు అత్యంత ఘనంగా అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహాం జరిగిన విషయం తెలిసిందే. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ కట్నకానుకుల గురించి చాలా మంది చర్చించుకుంటున్నారనేది విషయం. తాజా సమాచారం మేరకు స్నేహారెడ్డి తండ్రి అల్లు అరవింద్‌తో మీకు ఎంత కట్నం కావాలని కోరడం జరిగిందంట.
దానికి అల్లు అరవింద్ మాకు సింగిల్ పైసా వద్దు. మీ అమ్మాయి మా ఇంటికి ఒక చిన్న సూటికేసు తీసుకోని వస్తే అది మాకు చాలా సంతోషం. అంతేకాని మాకు ఎటువంటి కట్నకానుకలు అక్కరలేదని అన్నారని సమాచారం. మా కుటుంబంలో కలసి మెలసి ఉంటే చాలు అని అల్లు అరవింద్ అన్నారంట. దాంతో ఉప్పోందిపోయినటువంటి స్నేహారెడ్డి తండ్రి పెళ్శికి మాత్రం ఎలాంటి లోటు లేకుండా గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించుకోని భోజనాలు, పెళ్శి మండపం, బట్టలు తదితర విషయాలు తానే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారంట.
ఇక అల్లు అర్జున్ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేటట్లుగా.. వివాహ వ్యవస్థ ఆచారాలు నేటి ఆధునిక యువతకు కళ్ళకు కట్టినట్లుగా ‘వరుడు’ చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్ జరుపుకున్న ఐదు రోజుల పెళ్ళి అందరికీ గుర్తుండే వుంటుంది.‘రీల్‌లైఫ్’లో ఐదు రోజుల పెళ్ళిని ఘనంగా చేసుకొన్న అల్లు అర్జున్ ‘రియల్‌లైఫ్’లో తన వివాహాన్ని ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
No comments:
Post a Comment