యావత్ ప్రపంచానికి రోబోతో తన సత్తా చాటినటువంటి సూపర స్టార్ రజనీకాంత్ తదుపరి నటించనున్నటువంటి చిత్రం రానా. ఈసినిమాకి కెయస్ రవికుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓ చారిత్రాత్మక నేపద్యంలో రూపోందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకోణే, విద్యాబాలన్‌లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ఓ ముఖ్య పాత్రలో రజనీకాంత్ సరసన అలనాటి అందాల రాశి రేఖ కూడా నటిస్తున్నారు.
ఈ సినిమా చారిత్రక నేపద్యంతో కూడుకున్నది కావడంతో ఈసినిమా కోసం రజనీకాంత్ ప్రత్యేకంగా కత్తి యుద్దాన్ని నేర్చుకుంటున్నాడంట. రజనీకాంత్ ఈవయసులో ఈసినిమాపై ఇంత ఆసక్తి చూపిస్తుడడంతో కోలీవుడ్‌లో ఇప్పటికే ఈసినిమాపై చాలా అంచనాలు నెలకోన్నట్లు వినికిడి. రోబోతో వరల్జ్ వైడ్ మార్కెట్ లో తన సత్తా ఏంతో చూపించినటువంటి రజనీకాంత్ రానాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కనువిందు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్శనున్న ఈ చిత్ర తోలి షెడ్యూల్ లండన్‌లో ప్రారంభం కానుందని సమాచారం.
No comments:
Post a Comment