BREAKING NEWS
Monday, March 7, 2011
ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రం కథ ఏమిటంటే..
ఏ వ్యక్తైనా చెడు అనిపించుకోవడానికి క్షణకాలం పట్టదు. అదే మంచిపేరు తెచ్చుకోవాలంటే ఒక వ్యక్తిని, అతని గుణగణాలను ఎంతోకాలం గమనిస్తే కానీ అతనికి గుడ్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అందరిచేత పర్‌ఫెక్ట్ అని ఎలా అనిపించుకున్నాడన్నది 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రం కథ అంటున్నారు. ప్రభాస్ హీరోగా, కాజల్, తాప్సీ హీరోయిన్స్ గా దశరథ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా, కేరళ, హైదరాబాద్, అహోబిలం లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ చేశారు. యాక్షన్, లవ్, రొమాన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిల్ రాజు కధా రచయిత అవతారమెత్తారు. కె. విశ్వనాథ్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షాయాజి షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే: పి. హరి, కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: దిల్ రాజు, కథ-దర్శకత్వం: దశరథ్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment