తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కు చిరునామా రాజమౌళి. తను తీసినటువంటి ప్రతి సినిమాలలోను ఓ వైవిద్యమైన కొణాన్ని వెతుకుతుంటారు యస్ యస్ రాజమౌళి. రాజమౌళి ప్రస్తుతం ఈగ అనే సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇక ఈగ సినిమాకి సంబంధించినటువంటి రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి రామానాయుడు స్టూడియోలో వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సెట్‌లో తీయనున్నారు.
ఈగ సినిమా కోసం మొట్టమొదటసారి హాలీవుడ్ కమెరామెన్ జేమ్స్ ఫోల్డ్స్ అనే అతనిని టాలీవుడ్‌కి పరిచయం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా భారీ క్రేన్ తీసుకురావడం జరిగిందన్నారు. రజనీకాంత్ నటించినటువంటి రోబో సినిమాలో ఇలాంటి క్రేన్‌నే వాడడం జరిగింది. ఇక ఈగ సినిమా విషయానికి వస్తే నాని, సమంత, కన్నడ హీరో సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. సురేష్ బాబు ఈసినిమాని సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే యమ్ యమ్ కీరవాణి. ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు. ఇది ఇలాఉంటే ఈసినిమా తమిళ వర్సన్ రైట్స్ దాదాపు 5 కోట్లు పలికాయని సమాచారం
No comments:
Post a Comment