కాకరాపల్లి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు చిక్కులు ఎదురయ్యాయి. బాధితులు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రపై ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెంనాయుడికి వాటాలున్నాయని బాధితులు ఆరోపించారు. బహుశా దీనివల్లనే కావచ్చు, చంద్రబాబు పర్యటనకు ఎర్రంనాయుడు దూరంగా ఉన్నారు. ఈ వివాదంతో ఎర్రంనాయుడు చంద్రబాబుకు దూరమవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాకరాపల్లి వల్ల తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయిందని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. బహుశా ఎర్రంనాయుడి పాత్రను ఉద్దేశించి ఆ విధంగా అని ఉంటారు. అయితే, మరో రకంగా వైయస్ జగన్ చిక్కుల్లో పడినట్లు అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది. దీని గురించి సర్దిచెప్పుకోవడానికి జగన్ ప్రయత్నించారు. అప్పుడు ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించలేదని, ఇప్పుడు వ్యతిరేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
No comments:
Post a Comment