రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకవీరయ్య, మండవ వెంకటేశ్వర రావు వంటి శాసనసభ్యులు పూర్తిగా చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సభకు రాలేదు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు పలికారు. సముద్రాల వేణుగోపాలాచారి సభ ఆవరణలో తిరిగారు గానీ సమావేశానికి హాజరు కాలేదు. సత్యవతీ రాథోడ్, హరీశ్వర్ రెడ్డి, పి. మహేందర్ రెడ్డి, జోగి రామన్న తదితరులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే, వీరంతా చంద్రబాబును వ్యతిరేకిస్తారా, లేదా అనేది తెలియదు.
తెలంగాణ అంశంపై, నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తెలంగాణ శాసనసభ్యులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కూడా సగానికి పైగా హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 38 మంది ఉన్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరింత శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి బాట పట్టకుండా, పార్టీ క్యాడర్ నాగం జనార్దన్ రెడ్డి వెంట వెళ్లకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment