ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, February 3, 2011
సిఎం కిరణ్ రచ్చబండలో రసాభాస: వైయస్ బొమ్మ ఉంటే వద్దు
సిఎం కిరణ్ రచ్చబండలో రసాభాస: వైయస్ బొమ్మ ఉంటే వద్దు
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కృష్ణా జిల్లా రచ్చబండ కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ ఉన్న పోస్టర్లను తొలగించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పోస్టర్లను మాత్రం తొలగించలేదు. వైయస్ ఫోటో బ్యాడ్జిలతో సమావేశానికి వచ్చిన వారిని కూడా లోపలకు అనుమతించలేదు. దీంతో జగన్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రచ్చబండ కార్యక్రమం తీవ్ర రసాభాసగా మారింది.
కాగా బందరు పోర్టును త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే రైతులు తమ భూములను త్యాగం చేయాల్సి ఉంటుందని సూచించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోలవరాన్ని రాజకీయం చేస్తున్నాయన్నారు. దురుద్దేశంయతో పోలవరాన్ని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని అయితే ఎవరు అడ్డుకున్నా పూర్తి చేస్తామని చెప్పారు. కొల్లేరును ఐదవ కాంటూరునుండి మూడవ కాంటూరుకు కుదిస్తామని చెప్పారు.
No comments:
Post a Comment