BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, February 3, 2011

టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి అధికారుల దాడులు

టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి అధికారుల దాడులు

 Nama Nageswara Rao

టిడిపి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు

అయితే దాడులకు, రాజకీయాలకు సంబంధం లేదని పలువురు భావిస్తున్నారు. నామా గతంలోకంటే టాక్సు తక్కువ కట్టారు. అయితే ఆయనకు కాంట్రాక్టులు తక్కువ అయి టాక్సు తక్కువ కట్టారా లేదా అనే విషయం ఈ దాడులలో బయటకు రానుంది. దేశంలోనే టాప్ మోస్టు ఎంపీల జాబితాలో నామా నాగేశ్వరరావు రెండు, మూడు స్థానాల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 10వేల కోట్ల కన్స్రక్షన్‌లే ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, నామా నాగేశ్వరరావులు పెద్దమొత్తంలో అడ్వాన్సు టాక్సు కట్టారు. కాగా కేవలం హైదరాబాదు, ఖమ్మంలోనే కాకుండా ముంబయి, చెన్నై, కలకత్తాలోని ఆయన కంపెనీలపై కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

కాగా నామా నాగేశ్వరరావు ఆస్తులపై దాడిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో ఈ దాడులు చేయిస్తుందన్నారు. ఆయన పార్టీలోకంటే ముందుగానే కోట్లాది రూపాయల ఆస్తిపరుడన్నారు. రాజకీయాలతో ఆయన సంపాదించింది ఏమీ లేదన్నారు.
కంపెనీలపై, ఇళ్లపైన శుక్రవారం ఐటి దాడులు నిర్వహించింది. నామా నాగేశ్వరరావు ఆస్తిపై గత కొద్దికాలంగా నిఘా ఉంచారు. నామా తన ఆస్తులకు పూర్తిగా ఆదాయ పన్ను కట్టనట్టుగా భావించి ఐటి దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే నామాపై ఇలా అనుకోకుండా దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం. ఐటి అధికారులు మూడు బృందాలుకు విడిపోయారు. ఒక బృందం హైదరాబాదులోని నామాకు చెందిన మధుకాన్ కంపెనీపై, ఖమ్మంలో మరియు జిల్లాలోని నేలకొండపల్లిలోని మధుకాన్ కంపెనీలపై దాడులు చేశారు.

No comments:

Post a Comment