ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, February 3, 2011
చిరు భేటీకి ఇద్దరు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేల హాజరు
చిరు భేటీకి ఇద్దరు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేల హాజరు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెసు పార్టీ దోస్తీ నేపథ్యంలో గురువారం చిరంజీవి హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశానికి పీఆర్పీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పీఆర్పీకి చెందిన ఇంతమంది ఎమ్మెల్యేలు హాజరు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. అయితే కాంగ్రెసు పార్టీతో పొత్తు నేపథ్యంలో మంత్రి పదవులు తదితరాలను దృష్టిలో పెట్టుకొని వారు హాజరయినట్లుగా భావిస్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేల్లో ఈలి నాని ఒక్కరు చిరంజీవి అనుమతితో సమావేశానికి హాజరు కాలేదు.
ఇక వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలకు ఆహ్వానం పంపినప్పటికీ వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మేం పీఆర్పీలో ఉన్నప్పటికీ చిరంజీవి సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని చెప్పే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు అనీల్, మహేశ్వరరెడ్డి సైతం సమావేశానికి హాజరయ్యారు. గతంలో చిరంజీవి సమావేశం నిర్వహించిన సమయంలో పదిమంది లోపు ఎమ్మెల్యేలు హాజరయ్యేవారు. ఈసారి పదిహేనుమంది హాజరు కావడం మంత్రివర్గంలో చోటు కోసమేనంటూ పలువురు భావిస్తున్నారు. కాంగ్రెసు ఆఫర్‌పై నిర్ణయాన్ని చిరంజీవికి అప్పగిస్తూ ప్రజారాజ్యం విస్తృతస్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది.
No comments:
Post a Comment