BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, February 3, 2011

వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం, వైయస్ పేరే ఖరారు

వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం, వైయస్ పేరే ఖరారు

 YS Jaganహైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలబై ఐదు రోజుల్లో తమ పార్టీ వస్తుందని వైయస్ జగన్ అప్పట్లో చెప్పారు. కానీ ఆ గడువు ఎప్పుడో దాటి పోయింది. సంక్రాంతి తర్వాత అని, మార్చి రెండో వారంలో అని వైయస్ జగన్ వర్గం నాయకులు పార్టీ స్థాపనపై చెబుతూ వచ్చారు. కానీ మార్చిలో కూడా జగన్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్‌లో గానీ పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, పులివెందుల, కడప ఉప ఎన్నికల నాటికి పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే పార్టీ స్థాపనలో జాప్యం జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. అయితే, కారణం అది కాదని తెలుస్తోంది. తెలంగాణపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే పార్టీని స్థాపించాలనేది జగన్ అభిమతమని చెబుతున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని, తెలంగాణలో అడుగు పెట్టాలంటే కేంద్రం తెలంగాణపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు రావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. యథాతథ స్థితి చోటు చేసుకుంది.

పార్లమెంటు సమావేశాల లోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ, అది జరిగే అవకాశాలు లేవు. కాగా, రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనా, ప్రజారాజ్యం పార్టీతో వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, మంత్రివర్గంలో చేరుతుందా అనేది స్పష్టంగా తేలిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అప్పుడే జగన్ తన పార్టీ స్థాపనకు తగిన రంగం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు

No comments:

Post a Comment