BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, February 3, 2011

గిన్నీస్ బుక్ లోకి సైతం నవనీత్ కౌర్ వివాహం

గిన్నీస్ బుక్ లోకి సైతం నవనీత్ కౌర్ వివాహం

 Navneet kaur-Ravi Ranaఎమ్మెల్యే రవి రాణా ని నవనీత్‌కౌర్ అమరావతిలో నిన్న(బుధవారం)వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ వివాహం చాలా గ్రాండ్ గా ఎవరి ఊహకీ అందని విధంగా జరిగి మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహంతో పాటు మొత్తం 3,611 జంటలు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. కార్యక్రమంలో ఒక్కటైనవారిలో హిందూ జంటలు 2,443, 739 బౌద్ధ జంటలు, 150 ముస్లిం జంటలు, 15 క్రైస్తవ జంటలు, 13 అంధ జంటలు ఇంకా శారీరక వికలాంగులు, గిరిజనులు ఉన్నారు.

కార్యక్రమానికి హాజరైన విపరీతమైన రద్దీని అదుపుచేయడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. ఎమ్మెల్యే రవి రాణా ఏర్పాటుచేసిన ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో స్వయంగా ఆయనే పాల్గొని సినీనటి నవనీత్ కౌర్‌ను వివాహమాడి అందరికీ ఆదర్శంగా నిలిచారని అంతటా కొనియాడుతున్నారు. దేశ చరిత్రలోనేకాక ప్రపంచ చరిత్రలో ఇంతపెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు జరగడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కినట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను స్వామి రామ్‌దేవ్‌బాబాకు అందజేశారు.

ఇక వరుడు ఎమ్మెల్యే రవిరాణా కోసం ప్రత్యేకంగా ఒక గురప్రు బగ్గీని తీర్చిదిద్దారు.అందులోనే ఆయన మైదానంలో ఏర్పాలుచేసిన భారీ వేదికపైకి చేరుకున్నారు. సతీమణి నవనీత్‌కౌర్‌తో కలిసి అక్కడ ఆసీనులైన ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో అన్ని ధర్మాలకు చెందిన జంటలు పాల్గొనడంతో పురోహితులు అన్ని రకాల మంత్రాలు చదివారు. ప్రధాన వేదికకు 50 మీటర్ల దూరంలో చిన్న వేదిక ఏర్పాటు చేశారు. ర్యాంప్ మీదుగా నడిచి వెళుతున్న వధూవరులను ప్రముఖులందరు అభినందించి, ఆశీర్వదించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 1,100 జంటలకు వంట సామగ్రిని అందజేశాడు.

అలాగే ఎమ్మెల్యే రవి రాణా, నవనీత్‌కౌర్ దంపతుల డ్రెస్సు గురించి అంతటా హాట్ టాపిక్ గా మారింది. కుంకుమ రంగులో ఉన్న గాగ్రా చోలీతో వజ్రాలు పొదిగిన బంగారు నగలను ధరించి కల్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవనీత్ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోనట్లుగా గోధుమరంగు జోధ్‌పురి సూట్‌లో కల్యాణ వేదికపైకి వచ్చిన రవిరాణా కూడా అందరినీ అలరించారు. బంగారు రంగు వన్నెకల దారాలతో అల్లిన ప్రత్యేకమైన తలపాగను ధరించి కార్యక్రమానికే ఆకర్షణగా నిలిచారు.

No comments:

Post a Comment