ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, February 3, 2011
వైయస్ వారసులమని టిడిపితో కుమ్మక్కు: ముఖ్యమంత్రి కిరణ్‌పై జగన్ ఫైర్
వైయస్ వారసులమని టిడిపితో కుమ్మక్కు: ముఖ్యమంత్రి కిరణ్‌పై జగన్ ఫైర్
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై గురువారం విరుచుకు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను తమ పథకాలుగా చెప్పుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు తాము ఇచ్చిన సలహాల మేరకే అని కాంగ్రెసు పెద్దలు చెప్పడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వైయస్‌పై బురద జల్లడానికే కాంగ్రెసు పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారసులం అంటూనే వైయస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వైయస్ వారసులు అయితే పావలా వడ్డీ, ఫీజు రియింబర్సు మెంటును ఎందుకు కొనసాగించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైయస్ పేరుతో పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవదన్నారు. వైయస్‌ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు యువనేత తెలిపారు. ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెసు చేసింది ఏమీ లేదన్నారు. కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు.
రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదని, అయితే రాజన్న స్వర్ణయుగాన్ని చూశానని వైయస్ జగన్ అన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత స్వర్ణయుగమేనన్నారు. మహానేత వైయస్‌పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ వారసులమని చెప్పుకుంటూనే సిగ్గులేకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి పాలించే హక్కులేదని జగన్ అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పేనన్నారు.
No comments:
Post a Comment