BREAKING NEWS
Thursday, February 3, 2011
పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, జగన్ వర్గంలో భయాలు
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ పులివెందుల శాసనసభా స్థానంలోనూ చెక్ పెట్టేందుకు కాంగ్రెసు పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వైయస్ సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వైయస్ సోదరుడు, మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి కొంతకాలంగా పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివేకా కడప లోక్‌సభ బరిలోకి దిగితే బాగుంటుందనేది మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. పులివెందులలో వివేకా విజయం సాధిస్తారనే ధీమా పెరగడంతో పార్టీ ఆయనను శాసనసభకే పోటీ చేయించేందుకు మొగ్గుచూపుతోందని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అధిష్ఠానానికి ఇదే అభిప్రాయాన్ని వివరించినట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment