ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 25, 2011
అనుకోకుండా వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకొనే చాన్స్ ఎవరిది..
అనుకోకుండా వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకొనే చాన్స్ ఎవరిది..
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చే హిందీ హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చే వారు తక్కువ మంది ఉంటారు. వీరిలో నిలదొక్కుకునే వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒకప్పుడు కూడూ ఇదే ట్రెండ్ ఉండేది. అయితే అతి తక్కువ మందే తెలుగు సినీ రంగం నుంచి బాలీవుడ్ లో కాలు మోసి సక్సెస్ సాధించారు. వాళ్లలో జయప్రధ, శ్రీదేవిలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినవారే ఎక్కువ.
మళ్లీ ఈ మధ్య ఈ ట్రెండ్ అసిన్, శ్రియలతో ఆరంభం అయింది. అసిన్ పరిస్థితి పర్వాలేదనిపించేలా ఉంది. అక్కడ ఎవరికీ దక్కని రీతిలో ఏకంగా ముగ్గురు ఖాన్ లతో సినిమా ఛాన్సులు కొట్టేసింది అయితే ఆ ఆ తర్వాత త్రిష పరిస్థితి ‘కట్టామిఠా’గా తయారయింది. తొలిసినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. లేటెస్ట్‌గా ప్రియమణి చిత్రం రక్తచరిత్ర హిందీ, రావన్ చిత్రాల ఫలితాలతో బాలీవుడ్‌లో ప్రియమణి భవిత ప్రశ్నార్థకమైంది. కాగా ఇప్పుడు అనుష్క, ఇలియానా, మంచు లక్ష్మీప్రసన్నలకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరికొందరు కూడా బి.రెడీ అంటున్నారు ఇప్పుడు!
No comments:
Post a Comment