ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 25, 2011
అలా.. మొదలైంది' చిత్రం బయ్యర్లు రారనే...
అలా.. మొదలైంది' చిత్రం బయ్యర్లు రారనే...
చిన్న సినిమాకి బయ్యర్లు రారు కాబట్టి ప్రేక్షకుల్ని నమ్మి సొంతంగానే రిలీజ్ చేశాం...అంటున్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్. నాని, నిత్యమీనన్ కాంబినేషన్ లో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం 'అలా..మొదలైంది'. బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమైన ఈ చిత్రం క్రిందటవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుని విజయ పధంలో దూసుకుపోతోంది.ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకోవటానికి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...ఈ సినిమా చేయడానికి ముందు యాభై పైగా కథలు విన్నా. వారిలో దర్శకులమవుదామన్న వారినుంచి నాలుగైదు సినిమాలు చేసిన డైరెక్టర్ల దాకా ఉన్నారు. నందిని చెప్పిన కథ ట్రీట్ మెంట్ పరంగా బాగుంది. పురుషాధిక్య రంగంలో ఈ అమ్మాయి రావడమే విశేషం. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ వద్ద పనిచేశానని చెప్పింది. నాకంటే ముందు చాలామంది నిర్మాతల చుట్టూ తిరిగింది అవకాశాల కోసం. ఆమె వేవ్‌లెంగ్త్ నాకు మ్యాచ్ అయ్యింది. సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయగలదనిపించింది. అందుకే అవకాశమిచ్చా. కచ్చితంగా ఆమె పైకి వస్తుందనే నమ్మకం. ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.
No comments:
Post a Comment