ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 25, 2011
ప్రేమికుల రోజు కానుక
ప్రేమికుల రోజు కానుక
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా మూన్‌వాటర్ పిక్చర్స్ రూపొందిస్తున్న చిత్రం ‘కుదిరితే కప్పు కాఫీ’. సుమభట్టాచార్య కథానాయిక. శివ, మహి నిర్మాతలు. రమణ సాల్వ దర్శకుడిగా, సిరివెన్నెల సీతారామశాస్ర్తి తనయుడు యోగేశ్వర్ (యోగి) సంగీతదర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 11న విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరుణ్‌సందేశ్, రమణసాల్వ, మహి, శివ, యోగి తదితరులు పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిన సినిమా ఇది. పార్కుల్లో కనిపించే సాదాసీదా ప్రేమ ఇందులో ఉండదు. కవితాత్మకత సినిమా సాంతం కనిపిస్తుంది. ప్రేమికులరోజుకి 3రోజుల ముందు థియేటర్లలోకి వస్తోంది. యోగి సంగీతం కీరవాణిస్థాయిలో ఉందనే ప్రశంసలు సైతం వచ్చాయి. సంగీతం సహా కెమెరావర్క్ హైలైట్. దర్శకుడు తొలిచిత్రమైనా అనుభవజ్ఞునిలా మలిచారు. మామూలు థియేటర్లలో సైతం ఎసిలో ఉన్న ఫీలింగ్‌నిచ్చే సినిమా ఇది’ అన్నారు. దర్శకుడు రమణ సాల్వ మాట్లాడుతూ ‘సినిమాటోగ్రాఫర్‌గా అనుభవజ్ఞుడిని. టర్నులు, ట్విస్టులతో ఆకట్టుకునేలా సినిమా మలిచాను. రంగుల సమన్వయంతో అందమైన ఫోటోగ్రఫీ అలరిస్తుంది. ప్రేయసీప్రియుల మధ్య ఎడబాటుతోనే సిసలు ప్రేమ పుట్టుకొస్తుందని, పెయిన్ నుంచే ప్రేమ పెరుగుతుందని విడమర్చి చెబుతున్నాం. సందర్భానుసారమే పాటలుంటాయి’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 11న సినిమా విడుదల చేస్తున్నాం. ప్రేమికుల రోజు కానుక ఇది’ అన్నారు.
No comments:
Post a Comment