BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, January 25, 2011

అప్ టు డేట్‌గా ఉండాలి

అప్ టు డేట్‌గా ఉండాలి

 

అనుభవం పెరుగుతున్న కొద్దీ అభినయానికి ఆస్కారమున్న పాత్రల వైపు మొగ్గుచూపాల్సింది పోయి… గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు త్రిష. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా…? అని ఈ తమిళ తామరను అడిగితే- ‘‘ప్రత్యేకమైన కారణం ఏమీలేదు. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉండాలి. కేవలం మోడ్రన్ లుక్ కోసమే అలా కనిపిస్తున్నాను’’ అని సమాధానమిచ్చారు త్రిష. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఈ ప్రయత్నాలని కొందరి అభిప్రాయం.
దానికి మీరిచ్చే సమాధానం ఏమిటి? అన్నప్పుడు- ‘‘వారి అభిప్రాయాలను వారి వద్ద ఉండనీయండీ. బాలీవుడ్ అవకాశాలకోసం వెంపర్లాడాల్సిన పరిస్థితిలో నేను లేను. ఆ విషయం కాస్త ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చేతినిండా నాకు సినిమాలున్నాయి. గతంలో ఓ ప్రయత్నం చేశాను. అంతమాత్రం చేత చేసే పనిని పక్కన పెట్టి 24 గంటలూ అదే పనిమీద ఉంటాను అనుకోవడం వారి అమాయకత్వం. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కళాకారులు ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నానని వల్గారిటీకి కూడా అవకాశం ఇస్తానని అనుకోకుండి. ఎంత ట్రెండీగా వెళ్లినా… నా పరిధి నాకుంది’’ అంటూ తనదైన శైలిలో అందంగా నవ్వేశారు త్రిష.

No comments:

Post a Comment