‘ఆదుకాలం’ విమర్శకుల ప్రశంసలు
తాప్సీ, ధనుష్ జంటగా నటించిన ‘ఆదుకాలం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నిర్మాతకు మంచి వసూళ్లూ రాబట్టుకుంది. ఈ సినిమా అనుభవాన్ని నటి తాప్సీ ఇలా చెప్పుకొచ్చింది…. నటిగా ప్రేక్షకుల ఆనందమే మాకు అత్యంత ప్రధానమైంది. అభిమానుల చప్పట్లు, ప్రశంసలు ఎనలేని బలాన్ని ఇస్తాయి. ఇండిస్టీ పెద్దలు మా సినిమా చూసి బాగా చేశావ్ అని పొగిడినప్పుడు ఇంకా ఆనంద మేస్తుంది. అలాంటి మరిచిపోని సంఘటన ఇటీవల జరిగింది. అదేంటంటే… తమిళంలో ధునుష్ సరసన నేను నటించిన ‘ఆదుకాలం’ సంక్రాంతికి విడుదలై, మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. హీరో ధునుష్ మామ అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మా సినిమా చూడ్డానికి వచ్చారు.
నా చిత్రాన్ని చూడ్డానికి రజనీసార్ వచ్చారని తెలియగానే నాకెంత సంతోషమేసిందో చెప్పలేను. ఆయనకు ఎదురెళ్లి ఆహ్వానించాను. ఆయన పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడాను కూడా. పలు విషయాలు నేను చెబుతుంటే చక్కగా విన్నారు. తెరపై ఎన్నోసార్లు చూసిన నాకు, ఆయన పక్కన కూర్చొని నా సినిమా వీక్షిస్తానని ఊహించలేదు. ఇండిస్టీ గురించి, జీవితాన్ని గురించి కొద్ది మాటల్లోనైనా విలువైన సలహాలు ఇచ్చారు. ఆయన మాటతీరు, వేషం చాలా సింపుల్. ఓ సగటు ప్రేక్షకుడి మాదిరి సినిమాలో లీనమై ఎంజారు చేశారు. నేను నటించిన చిత్రం చూసి, రజనీ ఎంజారు చేశారని మనసులో గర్వంగా ఫీలయ్యాను కూడా ! అంతా అయిపోయాక… తిరిగి వెళ్లేప్పుడు నా దగ్గరికొచ్చి…’యు డిడ్ గుడ్ జాబ్’ అని ప్రశంసించారు. ఆ మాటలు ఎప్పటికీ మరిచిపోలేను.
No comments:
Post a Comment