BREAKING NEWS
Tuesday, January 25, 2011
ట్విట్టర్‌లో శృతి హాసన్ కి అసభ్యకరమైన రాతలు
సంక్రాంతికి విడుదలైన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన అందం శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైన ఆమె గత కొంత కాలంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ తో సమస్యలు ఎదుర్కోంటోంది. ఎవరో ఓ వ్యక్తి తన కిష్టం వచ్చినట్టు ఆమెను అసభ్యకరమైన, విచిత్రమైన ప్రశ్నలతో వేధిస్తున్నాడట. దాంతో ఏం చేయాలో పాలుపోని శృతి ట్విట్టర్‌లో పోస్టులు రాయటం తగ్గించిందిట. అయితే ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారు కాస్త మనస్సు పెట్టి ఆలోచించాలని, ఇలాంటి పనులు తగదని, ఇంకా ఎక్కువ చేస్తే ఎంక్వైరీ చేసి మరీ మూయించగలనంటూ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం శృతి సూర్య సరసన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘7మ్ అరివు’ చిత్రంలో నటిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment