పారిపోతే బాగుండు అనిపించింది
‘‘ఎముకలు కొరికే చలి అంటారే.. అదెలా ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను. ఆ చలికి తట్టుకోలేక వేడిగా ఉండే ప్రాంతానికి పారిపోతే బాగుండు అనిపించింది’’ అంటున్నారు శ్రుతి హాసన్. సూర్య సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఏళామ్ అరివు’ చిత్రం షూటింగ్ ఇటీవల హాంగ్‌కాంగ్‌లో జరిగింది. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉందట. దాని గురించే శ్రుతి చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’లో చాలా గ్లామరస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు శ్రుతి. ఈ చిత్రంలో చేసిన ప్రియ పాత్ర తనకెంతో ఇష్టమని కూడా ఆమె అన్నారు. మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అని శ్రుతిని అడిగితే – ‘‘అసలు డ్రీమ్ రోల్ అనే కాన్సెప్ట్ మీదే నాకు నమ్మకం లేదు. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారుతుంటాయి. మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఇవాళ డ్రీమ్ రోల్ అనిపించినది రేపు సాదా సీదా పాత్రలా అనిపించొచ్చు. అందుకే నేను ఫలానా పాత్ర నా ‘డ్రీమ్ రోల్’ అని ఫిక్స్ అవ్వను.
ఏ పాత్ర చేస్తే దాన్నే డ్రీమ్ రోల్‌గా భావించి చేస్తాను’’ అన్నారు. మీ చెల్లెలు అక్షరకు ఏమైనా సలహాలు ఇస్తారా? అన్నప్పుడు – ‘‘లేదు. మా నాన్నగారు మాకు బాగా స్వేచ్ఛ ఇస్తారు. ఆయన నాకు సలహాలు ఇవ్వరు. అలాగే నేను పెద్దదాన్ని కదా అని అక్షరకు సలహాలివ్వడానికి ట్రై చేయను. అక్షర తెలివిగలది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తనకు బాగా తెలుసు.
No comments:
Post a Comment