BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, January 25, 2011

అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!

అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!

 Tamannaసినిమాలపై ఎంతైనా ఖర్చు పెడతాడనే పేరున్న నిర్మాత అల్లు అరవింద్ కి ఆర్టిస్టులకి పారితోషికాలు ఇచ్చే విషయంలో మాత్రం గీసి గీసి బేరాలాడతాడనే బ్యాడ్ నేమ్ ఉంది. హీరోలు ఎలాగూ తమ ఫ్యామిలీ వాళ్లే కాబట్టి వాళ్లకి సినిమా రిజల్ట్ ని బట్టి డబ్బులిస్తుంటాడు. ఇక ప్రొడక్షన్ మిగతా నటీనటులు మాత్రం గీతా ఆర్ట్స్ సినిమా అంటే తిట్టుకుంటూ ఉంటారు. అలాగే తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న తమన్నాని ఒకేసారి రెండు సినిమాల్లో తీసుకుని నామమాత్రపు పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ ఒప్పందం చేసుకున్నాడు.

బద్రీనాథ్ సినిమాతో పాటు నాగచైతన్య, సుకుమార్ ల చిత్రంలో తమన్నాని హోల్ సేల్ గా బుక్క చేసుకున్నాడు. తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమన్నా తక్కువ మొత్తానికే నటించడానికి రెడీ అయింది. అయితే ఇంతలో తమన్నాకి తెలుగులో డిమాండ్ పెరిగింది. చాలా మంది అవకాశాలిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమాలు ఎలాగో ఉన్నాయి. దాంతో తమన్నా అల్లు అరవింద్ సినిమాకి సరిగా డేట్లివ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. ఆమె కారణంగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ దెబ్బతిని కొంత నష్టం కూడా జరిగింది. అందరికీ టోకరా ఇచ్చే అల్లు అరవింద్ కే తమన్నా కాజా తినిపించిందని అతని బాధితులు సంబరపడుతున్నారు.

No comments:

Post a Comment