ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 25, 2011
ఆ కథ హరీష్ శంకర్ ది కాదు, అందుకే... రవితేజ
ఆ కథ హరీష్ శంకర్ ది కాదు, అందుకే... రవితేజ
హరీష్ శంకర్ సత్తా నాకు ముందే తెలుసు. నాకు నాలుగు సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. అప్పుడే మనం ఓ సినిమా చేద్దాం అని చెప్పా. అనుకోకుండా 'షాక్' అవకాశం వచ్చింది. ఆ కథ తనది కాదు. ఆ కథలో వినోదం పండించడానికి అవకాశం తక్కువ. కానీ హరీష్ తన శక్తి మేరకు ప్రయత్నించాడు. ఆ సినిమాలో మీరు నవ్విన ప్రతి సన్నివేశం హరీష్ శంకర్ రాసుకొన్నదే అంటూ తన షాక్ చిత్రం ప్లాప్ గురించి చెప్పుకొచ్చారు రవితేజ. ఆయన తాజా చిత్రం మిరపకాయ్ సంక్రాతి విజేతగా నిలబడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇలా స్పందించారు. అలాగే హరీష్ శంకర్ మీద తాను పెట్టుకున్న నమ్మకాన్ని వందకి రెండు వందల శాతం నిలబెట్టుకున్నాడన్నారు. అలాగే తాను ఎవరికీ సమాధానం చెప్పటానికి సినిమా చేయననీ, ఒక సినిమా ఎలా ఆడుతుందో ఆ సినిమా వచ్చే వరకూ ఎవరం చెప్పలేమని అన్నారు. అలాగే ప్రతిభనీ, కష్టాన్నీ నమ్మాకుంటే విజయం వస్తుందని, తాను కూడా అదే చేశానని చెప్పారు.
No comments:
Post a Comment